హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 569 కి.మీ. దూరం. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 8 గంటు ప్రయాణించాలి. రైల్లోనూ సుదీర్ఘ ప్రయాణమే. అలాంటిది కేవలం అరగంటలో చేరిపోతే.. అంటే గంటకు దాదాపు 965 కి.మీ. దూసుకెళ్తే! వినడానికి వింతగా ఉన్నా.. అలాంటి రోజులు వచ్చేస్తున్నాయి. హైపర్‌లూప్ రైలు సర్వీసుల్లో తొలిసారి ప్యాసింజర్లను అనుమతించారు. కళ్లు తెరిచే లోపలే రాకెట్లా దూసుకెళ్లి హైపర్‌లూప్ రైలు సర్వీసు నిర్మాణపై చాలా రోజులే అయినా పౌరులకుల ఆదివారం ట్రయల్ నిర్వహిచారు. ఈ రైళ్లలో గాలిని తీసేయడంతో, బయటి నుంచి పీడనం లేకుండా జర్రున జారుకుంటూ వెళ్తాయి.
అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో వర్జిన్ గ్రూప్ హైపర్‌లూప్ రైలును ప్రయాణికుల కోసం తొలిసారి నడిపింది. ఇదివరకు వందలసార్లు ఈ ‘గొట్టం రైలు’ ట్రయల్స్ విజయవంతం కావడంతో ప్రయాణికులను అనుమతిస్తున్నారు. అయితే వారి ప్రాణాలకు హామీ కూడా ఇవ్వాలి కనుక ప్రస్తుతం కేవలం గంటకు వంద కి.మీ. దూరంతోనే ఈ రైలు దూసుకెళ్తోంది. హైపర్‌లూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జోష్ జోజెల్, డైరెక్టర్ ఆఫ్ ప్యాసింజర్ ఎక్స్‌పీరియెన్స్ సారా లుచియాన్ ఆదివారం ఇందులో తొలి ప్యాసింజర్ ప్రయాణం చేశారు. రైలు అర కి.మీ. దూరాన్ని 15 సెకన్లలోనే అధిగమించింది. వర్జిన్ గ్రూప్ నెవడాలోని ఎడారిలో హైపర్‌లూప్ జర్నీ ప్రయోగాలు చేపడుతోంది.