లాక్ డౌన్ లోనూ మద్యం దుకాణాలను ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను ఓపెన్ చేశారు. తెలంగాణలో ఈరోజు నుంచి మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దాదాపు 45 రోజుల తరువాత మద్యం దుకాణాలు ఓపెన్ కావడంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యంప్రియులు ఎగబడి మద్యం కొనుగోలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలో తొలి రోజు మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి రూ.90 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 21 నాటికి మద్యం దుకాణాల్లో రూ.110 కోట్ల స్టాక్ ఉందని, ఇవాళ్టి అమ్మకాల తర్వాత రూ.20 కోట్ల స్టాక్ మాత్రమే ఉందని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో తొలిరోజు మద్యం అమ్మకాలు రూ.67 కోట్లుగా గుర్తించారు.