తొలిసారిగా చంద్రుడి రంగుల చిత్రం...  - Telugu News - Mic tv
mictv telugu

తొలిసారిగా చంద్రుడి రంగుల చిత్రం… 

May 4, 2020

First detailed colour-coded geological map of Moon for scientists released

చంద్రుడు మనకు పచ్చగా కనిపిస్తాడు. వాతావరణాన్ని బట్టి తెల్లగానూ, ఎర్రని ఛాయాల్లోనూ ఉంటాడు. చంద్రుడి ఫోటోలు కూడా చాలావరకు మనకు బూడిదరంగులోనే కనిపిస్తాయి. చంద్రుడి ఉపరితలాన్ని బట్టి రంగులద్దతూ కొన్ని మ్యాపులు చలామణిలో ఉన్నా వాటికి ప్రామాణికత లేదు. ఈ కొరత తీర్చడానికి శాస్త్రవేత్తలు తొలిసారిగా చంద్రుడి నైసర్గిక ప్రాంతాలకు వివిధ రంగులు జతచేసి వ్యాప్ రూపొందించారు. అమెరికా జియాలజికల్ సర్వే ఈ కలర్ కోడెడ్ మ్యాపును తయారు చేసింది. 

జియాగ్రఫికల్ మ్యాపుల్లో భూమి, రాతి పొరలను బట్టి, అక్కడి ధాతువులను బట్టి ఆయా ప్రాంతాలకు రంగులు కేటాయిస్తాయి. గతంలో చంద్రుడికి సబంధించి సేకరించిన డేటా ఆధారంగా.. ముఖ్యంగా నానా డేటా, లూనార్ ప్లానెటరీ ఇన్ స్టిట్యూట్ సమాచారాన్ని ఆధారం చేసుకుని ఈ రంగుల జాబిల్లిని తయారు చేశారు. ఇదివరకు తయారు చేసిన మ్యాపుల్లోని లోటపాట్లను సరిదిద్దడంతోపాటు పరిశోధకులకు ఉపయోగపడేలా దీన్ని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.