Oscars 2023 : ఆస్కార్ అవార్డులో తొలి నిరాశ. అవార్డు మిస్ అయిన "ఆల్ దట్ బ్రీత్స్".. - Telugu News - Mic tv
mictv telugu

Oscars 2023 : ఆస్కార్ అవార్డులో తొలి నిరాశ. అవార్డు మిస్ అయిన “ఆల్ దట్ బ్రీత్స్”..

March 13, 2023

ఎట్టకేలకు అందరూ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 95వ అకాడమీ అవార్డ్స్ అనగా ఆస్కార్ అవార్డ్స్ 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న ఈ అవార్డు షో షాంపైన్ కార్పెట్ పై హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది తారలు సందడి చేస్తున్నారు. రెడ్ కార్పెట్ పై స్టార్స్ ఫ్యాషన్ లుక్ లో కనిపించారు.

ఆస్కార్ 2023లో భారతీయ సినిమాలు చరిత్ర క్రియేట్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ పొందిన సంగతి తెలిసిందే. ఈ విభాగంలో నామినేషన్ పొందిన తొలి భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ విజయంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేటి వేడుకలో ఈ పాట ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. దీనిని కాల భైరవ్, రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శించనున్నారు.

ఇదే కాదు దర్శకుడు షౌనక్ సేన్ యొక్క డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ మరియు గునీత్ మోంగా యొక్క లఘు డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ కూడా ఈ ఏడాది ఆస్కార్ అవార్డులలో నామినేషన్లు పొందాయి. ఆస్కార్ 2023లో ప్రముఖ హాలీవుడ్ తారల్లో దీపికా పదుకొణె వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది.

కాగా ఆస్కార్‌లో భారత్ కు ఈ ఏడాది మొదటి నిరాశ ఎదురయ్యింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ లో నామినేట్‌ అయిన ఆల్‌ దట్‌ బ్రీత్స్` కి అవార్డు రాలేదు. ఆ స్థానంలో అమెరికాకి చెందిన `నావల్నీ` డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ కి అవార్డు గెలుచుకుంది. ఈ మూవీకి డానియల్‌ రోహెర్‌ దర్శకత్వం వహించారు, ఇది రష్యా అపోజిషన్‌ లీడర్‌ అలెక్సీ నావల్నీ చుట్టూ తిరిగే కథ. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో నామినేట్‌ అయిన `ఆల్‌ దట్‌ బ్రీత్స్` చిత్రానికి షానక్‌ సేన్‌ డైరెక్టర్. ఈ మూవీ ఇద్దరు అన్నదమ్ముల కథని తెలియజేస్తుంది.