మతిమరుపుకు పరిష్కారం.. అల్జీమర్స్‌కు ఔషధం..  - MicTv.in - Telugu News
mictv telugu

మతిమరుపుకు పరిష్కారం.. అల్జీమర్స్‌కు ఔషధం.. 

October 23, 2019

dementia.

అల్జీమర్స్‌ వ్యాధి ముదరకుండా ఔషధాన్ని కనిపెట్టామని అమెరికాకు చెందిన ఆలోపతి మందుల దిగ్గజ సంస్థ ‘బయోజెన్‌ ఇన్‌కార్పొరేషన్‌’ వెల్లడించింది. డిమెన్షియా వ్యాధికి తాము ఔషధాన్ని కనిపెట్టామని, తద్వారా అల్జీమర్స్‌ వ్యాధిగా అది ముదరకుండా నిరోధించగలమని సదరు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో మైఖేల్‌ వోనత్సోస్‌ మాట్లాడుతూ.. ‘మేము ఈ పరిశోధనల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించాం. మరే సంస్థ ఇంతగా ఖర్చుపెట్టలేదు. ఈ ఔషధ మాత్రల కోసం వచ్చే ఏడాది మొదట్లో అమెరికా, యూరప్, జపాన్‌ దేశాల్లో లైసెన్స్‌కు దరఖాస్తు చేస్తాం. లైసెన్స్‌ దరఖాస్తు కోసం కనీసం ముందుకు వచ్చే అవకాశం లేదు. అల్జీమర్స్‌కు సంబంధించి అదే ఓ గొప్ప విప్లవం అవుతుంది. అల్జీమర్స్‌కు ఇదో అద్భుతమనే చెప్పవచ్చు’ అని ఆయన అన్నారు.

కాగా, డిమెన్షియా వ్యాధి ముదురితే అల్జీమర్స్‌ వస్తుంది. డిమెన్షియా వ్యాధి వచ్చినవారు ఇతరులు, పరిసరాల గురించి మరిచిపోతుంటారు కానీ, తన గురించి జ్ఞాపకం ఉంచుకుంటారు. తన గురించి కూడా మరచిపోవడాన్ని అల్జీమర్స్‌గా పేర్కొంటారు.  అల్జీమర్స్‌ వ్యాధి ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైంది. ఈ వ్యాధి ఇప్పుడు భారతీయుల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ జబ్బు ప్రధాన లక్షణం అతి మతి మరుపు. ఈ వ్యాధి సోకినవారు బయటకు వెళితే మళ్లీ వారంతట వారు ఇంటికి వచ్చే అవకాశం లేదన్న కారణంగా చాలా మంది వ్యాధిగ్రస్థులను ఇంటికో, ఇంట్లోని ఓ గదికో పరిమితం చేస్తారు.