హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ షురూ.. ఆటో డ్రైవర్‌పై తొలి కేసు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ షురూ.. ఆటో డ్రైవర్‌పై తొలి కేసు

May 20, 2020

vvv

మందుబాబులపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝులిపించడం ప్రారంభించారు. లాక్‌డౌన్ కారణంగా పక్కన పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తిరిగి మొదలుపెట్టారు. అనుమానితులను ఆపి పరీక్షలు జరుపుతున్నారు. ఎవరైనా తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే గతంలో చేసినట్టుగానే జరిమానాలు విధిస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపులు రావడంతో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో తాజాగా మంగళవారం జరిగిన తనిఖీల్లో తొలి కేసు నమోదు అయ్యింది. 

పుత్లిబౌలి చౌరస్తాలో కోఠీ నుంచి వెళ్తుండగా ఓ ఆటో బోల్తా పడింది. అనుమానంతో అతనికి బ్రీతలైజర్ పరీక్షలు నిర్వహించగా, 187 బీఏసీ కౌంట్ వచ్చింది. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో మందు బాబుల్లో టెన్షన్ మొదలైంది. ఇంత కాలం వరకు కరోనా సాకుతో డ్రంక్ అండ్ డ్రవ్ ఉండదని తాగి ప్రయాణాలు చేసేవారు. కానీ ఇక నుంచి  మరోవైపు మాస్క్‌లు లేకుండా బయటకు వచ్చిన వారిపై కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరైనా మాస్కు లేకుండా కనిపిస్తే.. రూ. 1000 జరిమానా వేస్తామని తెలిపారు. కాగా సాయంత్రం 7 గంటల తర్వాత కర్ఫ్యూ ఉండటంతో ఆలోపే ప్రజలు ఇళ్లకు చేరిపోవాలని ఆదేశిస్తున్నారు.