మహిళా అంపైర్‌గా సరికొత్త రికార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా అంపైర్‌గా సరికొత్త రికార్డ్

October 24, 2019

Cricket....

క్రికెట్ చరిత్రలో ఓ మహిళ సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అంపైర్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఉమెన్స్ క్రికెటర్ లారెన్ ఏజెన్‌బాగ్ ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌కు లారెన్‌ను నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో పురుషుల ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌కు ఎంపికైన తొలి మహిళా అంపైర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమెకు పలువురు శుభాకాంక్షలె తెలిపారు. 

లారెన్ ప్రస్తుతం స్టాండర్డ్ మహిళా అంపైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఆమె క్రికెటర్‌గా కీలక రోల్ పోషించారు. ఐసీసీ మహిళా అంపైర్ల ప్యానల్‌లో సభ్యురాలిగా ఉన్న ఆమె ఇటీవల మహిళా వరల్డ్ టీ20లో క్వాలిఫయర్‌  మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా పురుషుల మ్యాచ్‌కు అంపైర్‌గా ఎంపికయ్యారు. ఆమె సాధించిన ఘనతపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రశంసలు కురిపించింది. మిగతా మహిళా క్రికెటర్లకు ఒక స్ఫూర్తిగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.