భారతదేశంలోని టాప్ టాక్ షోలలో ఒకటి బాలయ్య అన్‌స్టాపబుల్. సీరియస్ బాలకృష్ణలోని సరికొత్త చిలిపి తనాన్ని బయటికి తీసిన ఈ టాక్ షోకి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. బోలెడన్ని సినిమాలు కూడా తీసుకురాని పేరు ఆహకి ఈ టాక్ షో తీసుకొచ్చేసింది. గెస్టుల ఎంపిక ఒకెత్తయితే.. వారిని బాలయ్య స్టేజిపై ఆడుకునే విధానం ఆకట్టుకుంటుంది. గర్ల్ ఫ్రెండ్స్, డేటింగ్, లవ్ అంటూ యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండటంతో ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ హిట్ అయింది. అయితే సంక్రాంతి సందర్భంగా తాజాగా ఒక క్రేజీ వీడియో గ్లింప్స్ వదిలింది ఆహ టీమ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబందించిన ఈ నిమిషం వీడియో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
నిజానికి ఈ పండగకే పవన్ బాలయ్యల ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తే బావుండేది అన్న అభిప్రాయం సర్వత్రా వస్తున్నా.. కనీసం ప్రోమోలైనా వదలండి బాబు అంటూ మెగా నందమూరి అభిమానుల నుండి పేద ఎత్తున కామెంట్స్ రావటంతో తాజాగా బాలయ్య – పవన్ గ్లింప్స్ రిలీజ్ కాగా.. పవన్ కళ్యాణ్ ని తనదైన శైలిలో బాలయ్య ఆటపట్టించాడు. అన్‌స్టాపబుల్ సెట్స్‌లోకి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అడుగు పెట్టిన విజువల్స్‌తో పాటు పవన్ కళ్యాణ్, బాలయ్య స్టేజ్‌పై ప్రేక్షకులకు అబివాదం చేస్తున్న విజువల్స్‌ను మనం గ్లింప్స్‌లో చూడొచ్చు. అలాగే ఈయన మెజర్మెంట్స్ (కొలతలు) కొన్నింటిని తీసుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి బాలకృష్ణ పవర్ పంచ్ వేయటం.. దానికి పవన్ విరగబడి నవ్వటం అనేది గ్లింప్స్‌లో ఆసక్తి రేపుతున్న అంశాలు. రాజకీయ ప్రస్థానం, మూడు పెళ్ళిళ్ళు, పరిటాల రవి గుండు కొట్టించాడన్న ప్రచారం వంటి క్రేజీ క్వశ్చన్స్ పవన్ ని బాలయ్య అడిగినట్టు టాక్ వస్తుంది. చూద్దాం మరి.. పవన్ బాలయ్యల ఎపిసోడ్ పై ఏర్పడ్డ భారీ అంచనాల దృష్ట్యా.. దేశంలోనే ఇది బిగ్గెస్ట్ ఎపిసోడ్ కానుందని..ఆహ టీమ్ ప్రమోట్ చేస్తుంది.