First indian army woman skydiver lance naik manju
mictv telugu

మొదటి మహిళా ఆర్మీ స్కైడైవర్!

December 1, 2022

ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఒక మహిళా కమాండో సాహసం చేసింది. 10వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేసిన మొదటి మహిళా ఆఫీసర్ ఈమె.
కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ నుంచి ఈస్టర్న్ కమాండ్లో మోహరించిన లాన్స్ నాయక్ మంజు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధృవ్ నుంచి 10వేల అడుగుల ఎత్తు నుంచి దూకింది. భారత సైన్యం నుంచి ఈ సాహసం చేసిన మొదటి మహిళగా పేరు నమోదు చేసుకుంది.

భారత దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో.. రాజకీయాలు, సాయుధ దళాలు, పరిపాలన, వ్యాపారం వంటి అనేక ప్రముఖ రంగాలు ఇప్పటికీ పురుషుల ఆధిపత్యంలో ఉన్నాయి. కానీ ఈ పురుష ఆధిపత్య వృత్తుల్లో మహిళలు తమ సామర్థ్యం నిరూపించుకొని తమ పేరు సుస్థిరం చేసుకుంటున్నారు. లాన్స్ నాయక్ మంజు.. భారత సైన్యంలోని మొదటి మహిళా స్కైడైవర్ గా నిలిచింది.

ఈస్టర్న్ కమాండ్ తన అధికార పేజీ ద్వారా లాన్స్ నాయక్ సాధించిన విజయాన్ని గురించి ట్వీట్ చేసింది. భారత సైన్యం నుంచి మొదటి మహిళ ఈ ఫీట్ సాధించిందని అందులో పేర్కొన్నారు. మంజు ఇద్దరు స్కైడైవర్ ల సహాయంతో దూకడానికి ముందు సేఫ్టీ గేర్ ని ధరించింది. ఇండియన్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్ కు చెందిన ప్రత్యేక స్కైడైవింగ్ ట్రైనింగ్ టీమ్ ఈమెకు శిక్షణ ఇచ్చింది. 2021లో ప్రభుత్వ గణాంకాలు నమోదు చేసినప్పుడు ఆర్మీలో 12,28,036 మంది పురుషులతో పోలిస్తే 6,607మంది మహిళలు మాత్రమే ఉన్నారు. భారత వైమానిక దళంలో 1,607మంది మహిళా అధికారులు, 1,46,727మంది పురుషులు ఉన్నారు. ఇక నౌకాదళంలో 704మంది మహిళా అధికారులు ఉంటే.. 10,108 మంది పురుషులు ఉన్నారు. ఈ విధంగా లాన్స్ నాయక్ మంజు సాధించిన ఘనత దేశంలోని వివిధ వృత్తిపరమైన రంగాలనే కాదు.. ముఖ్యంగా సాయుధ దళాల్లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనే మహిళలందరిలో ఈ విజయం నిలిచిపోతుంది.