బ్రిటన్ రాయల్ బేబీ ఫోటోలు వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

బ్రిటన్ రాయల్ బేబీ ఫోటోలు వైరల్

May 8, 2019

బ్రిటన్ రాచవంశంలోకి మరో బుల్లి యువరాజు చేరాడు. కానీ అతని ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు.. దీంతో చాలా మంది ఆ రాయల్ బేబీ దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠకు తెరచిందుతూ తల్లిదండ్రులు వాడి ఫొటోలు బయటపెట్టారు.  బ్రిటన్‌ యువరాజు హ్యారీ,  మేఘన్‌ మార్కెల్‌ దంపతులు తమ తొలి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేశారు. కొద్ది సేపట్లోనే ఈ బుల్లి రాకుమారుడి ఫోటోలు వైరల్‌‌గా మారాయి. 

మే 6, 2019 సోమవారం ఉదయం 05:26 గంటలకు (అక్కడి కాలమానం) మేఘన్ మార్కెల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ప్రిన్స్ హ్యారీ తన ఇన్‌స్టా‍గ్రామ్‌ ద్వారా  వెల్లడించారు. గతేడాది మే 19, 2019న వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లోని బెర్క్‌ షైర్‌ కౌంటీ విండ్సర్‌‌లోని సెయింట్‌ జార్జి చర్చిలో హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ వివాహం జరిగింది. వివాహం అయి ఏడాది తిరగకుండానే వారు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.