ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది

October 21, 2020

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్ 20వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకు ‘జిల్’ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహితుస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నది. ఇటీవల పూజా హెగ్డే పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. 

తాజాగా ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజుని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను‌ విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. పీరియడ్ రొమాంటిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు తోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది.