వర్మ 'మర్డర్' నుండి మొదటి సాంగ్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ ‘మర్డర్’ నుండి మొదటి సాంగ్ విడుదల

August 4, 2020

First song got released from rgv’s next movie

కరోనా కారణంగా సినిమాలు విడుదల కావడం లేదు. కానీ, దర్శకడు వర్మ మాత్రం ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అని ఓ ఆన్లైన్ థియేటర్ ను ఏర్పాటు చేసి అందులో వరుసగా సినిమాలు విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘పవర్ స్టార్’, ‘నేకెడ్’ అనే సినిమాలను విడుదల చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కథను ఆధారంగా చేసుకొని ఓ సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశాడు. 

తాజాగా ఈ సినిమాలోని ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా?’ అంటూ ఓ పాటను విడుదల చేశాడ. ఈ పాటకి సిరాశ్రీ లిరిక్స్ అందించగా… వర్మ పాడాడు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి వర్మ ప్లాన్ చేస్తున్నాడు. ఆనంద్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, గాయత్రి భార్గవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు.