‘మిస్ హిజ్రా’ టైటిల్ కోసం 1,500 మంది పోటీ - MicTv.in - Telugu News
mictv telugu

‘మిస్ హిజ్రా’ టైటిల్ కోసం 1,500 మంది పోటీ

August 24, 2017

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా.. మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఏసియా.. మిసెస్ ఇండియా.. ఈ పోటీల గురించి మనకు తెలుసు.. ఆడవాళ్ల కోసం, మగవాళ్ల కోసం వీటిని నిర్వహిస్తున్నారు. మరి ఆడా, మగా కాని వాళ్ల కోసం ఏ పోటీ లేదు ప్రస్తుతానికి. ఏం వాళ్లు మాత్రం అందంగా ఉండరా? ఉంటారు.. అందం చూసే కళ్లను బట్టి ఉంటుంది. అందుకే మన దేశంలో తొలిసారిగా మిస్ హిజ్రా పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 27న ఢిల్లీలోని గురుగ్రామ్ లో మిస్ ట్రాన్స్ క్వీన్2017 పేరుతో ఈ పోటీని నిర్వహిస్తారు. ఈ కిరీటం సాధించడానికి 1,500 మందికిపైగా హిజ్రాలు ‘బావలు సయ్యా..’ అంటూ బరిలో దిగారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఎలాంటి వయోపరిమితీ లేదు. కేవలం హిజ్రా.. అదేనండి ట్రాన్స్ జెండర్ అయితే చాలట.

సుహానీ డ్రీమ్ కాచర్స్ సంస్థ వ్యవస్థాపకురాలు రీనా రాయ్ ఈ పోటీ నిర్వహిస్తున్నారు.

న్యాయనిర్ణేతలుగా.. హిజ్రాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంఘసేవకురాలు గౌరీ సావంత్, మిజీ మిస్టర్ గే ఇండియా సుషాంత్ దిగ్వికర్, ఫ్యాషన్ డిజైనర్ షైనే సోని, విద్యావేత్త అవ్లీన్ ఖోకర్లు వ్యవహరిస్తున్నారు.

ఈ  పోటీలో గెలిచిన విజేత థాయ్ లాండ్ లో అంతర్జాతీయ స్థాయిలో జరిగే మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ క్వీన్ పోటీలో భారత్ తరఫున పాల్గొంటుంది. ఫస్ట్ రన్నరప్ ఆస్టేలియాలో జరిగే మిస్ ట్రాన్స్ సెక్సువల్ లో పాల్గొంటుంది.