చేప చర్మంతో కృత్రిమ యోని.. ట్రాన్స్ మహిళకు సక్సెస్ - MicTv.in - Telugu News
mictv telugu

చేప చర్మంతో కృత్రిమ యోని.. ట్రాన్స్ మహిళకు సక్సెస్

May 17, 2019

First transgender woman in the world undergoes vaginal construction with fish skin.

లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకుని పురుషులు మహిళలుగా మారుతున్నారు. పురుషాంగాన్ని తొలగించుకుని, హార్మోన్స్ థెరపీ వంటి చికిత్సలు తీసుకుంటారు. ఈ క్రమంలో వారికి పునర్జన్మ ఎత్తినంత పనే అవుతుంది. చాలా బలహీనంగా తయారవుతారు. కొందరు చనిపోతుంటారు. ఇంత చేసినా వారికి లైంగిక సంతృప్తి వుండదు. ఎందుకంటే వారికి యోని వుండదు. పురుషాంగం తీసి యోనినైతే అమర్చరు. దీంతో చాలామంది ట్రాన్స్‌జెండర్లు లైంగిక సుఖానికి నోచుకోరు. ఇలాంటివాళ్ళకు ఓ పరిష్కార మార్గం వుంది. అదే కృత్రిమ యోని. టిలాపియా చేప చర్మంతో ఈ కృత్రిమ యోనిని తయారు చేస్తారట. ఇటీవల దీన్ని 35 ఏళ్ల మాజు అనే లింగమార్పిడి మహిళకు అమర్చారు.  ప్రపంచంలో లింగమార్పిడితో మహిళగా మారినవారిలో ఈ శస్త్ర చికిత్స చేయించుకున్న తొలి వ్యక్తి మాజు అని వైద్యులు తెలిపారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.

బ్రెజిల్‌లోని సావో పాలోలో ఫ్లవరిస్ట్‌గా పనిచేస్తున్న మాజు 1999లో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని మహిళగా మారింది. పదేళ్ల తర్వాత ఆమె యోని నాళం మూసుకుపోవడం ప్రారంభించింది. దీంతో సంభోగ సమయంలో భాగస్వామినికి నొప్పి కలుగుతోందని వైద్యులను ఆశ్రయించిందామె. దీన్ని సవాల్‌గా తీసుకున్న వైద్యులు మూడు వారాల కిందట టిలాపియా చేప చర్మంతో తయారు చేసిన కృత్రిమ యోనిని ఆమెకు అమర్చారు. ఆ తర్వాత ఆమెకు కృత్రిమ యోనితో శృంగారంలో పాల్గొన్నప్పుడు చాలా థ్రిల్ కలుగుతోందని.. మూత్ర సమస్యలు కూడా లేవని ఆనందం వ్యక్తం చేసింది.

First transgender woman in the world undergoes vaginal construction with fish skin

ఈ చేప చర్మంతో ఎవరికి ఎంత పరిమాణం యోని కావాలంటే అంత పరిమాణంలో యోనిని తయారు చేయగలం.. వదులు చేయడం, లేదా బిగువుగా ఉండేలా దాన్ని అమర్చగలమని.. ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు ప్రొఫెసర్ లియనార్డో బెజెర్రా తెలిపారు. ఇలా ఇప్పటివరకు ఈ చేపచర్మం యోనిలను పదిమంది ట్రాన్స్ జెండర్లకు అమర్చామని వైద్యులు వెల్లడించారు.