బట్టలను మార్చేసినంత సులభంగా స్మార్ట్ ఫోన్లను మార్చేస్తున్న కాలమిది. ఒక ఫోన్ను ఆరు నెలలు వాడగానే బోర్ కొట్టేసి మరోటి వాడుతున్నారు. కంపెనీలు కూడా ఈ బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. వెర్రి అనండి, లగ్జరీ అనండి.. ఇదొక ట్రెండ్ అంతే. తాజాగా ప్రపంచంలో తొలి ట్రాన్స్ పరెంట్ స్మార్ట్ ఫోన్ ‘నథింగ్’ ఫోన్ (1) అందులో ఒకటి. దీని అమ్మకాలు ఫ్లిప్ కార్టులో ఈ రోజు(గురువారం) సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఫోన్ వెనుకవైపు భాగం మొత్తం పారదర్శకంగా నథింగ్ ప్రత్యేకత. కాల్స్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెనుక లైట్లు వెలుగుతాయి. కేవలం తెలుపు, నలుపు రంగుల్లోనే లభిస్తున్న ఈ ఫోన్ను ముందుగా ఆర్డర్ చేసిన వారికి ముందుగా డెలివరీ చేస్తారు. ఫ్లిప్ కార్డులో వెయ్యి రూపాయల డిసౌంట్ లభిస్తోంది.
ఫీచర్లు..
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778 జీప్లస్ ప్రాసెసర్
6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ ప్లే
4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్ లెస్ చార్జింగ్
50 మెగా పిక్సల్ సోనీ కెమెరా సెన్సార్
120 హెర్జ్ రీఫ్రెష్ రేటు
ధర
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999.
8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999
12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ధర రూ.37,999