మొట్టమొదటి ట్వీట్ చేసిన చిరంజీవి.. - MicTv.in - Telugu News
mictv telugu

మొట్టమొదటి ట్వీట్ చేసిన చిరంజీవి..

March 25, 2020

chiranjeevi

ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన చిరంజీవి. ‘చిరంజీవి కొణిదెల’ అనే పేరుతో ట్విట్టర్‌ ఖాతాను ప్రారంభించారు. ‘అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు’ అని పేర్కొంటూ కరోనా విజృంభణపై జాగ్రత్తలు తెలుపుతూ చిరు తొలి ట్వీట్ చేశారు. చిరు ట్విట్టర్ లో అడుగుపెట్టిన తొలిరోజే ఆయనకు 38 వేల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు.

ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన సోషల్ మీడియా అకౌంట్స్‌ ప్రారంభిస్తున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఇప్పటి వరకు తన అభిప్రాయాలను వీడియో రూపంలో ప్రెస్ రిలీజ్ చేస్తూ ఉండేవారు. ‘నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్‌ అవుదామనుకుంటున్నాను. నేను ఇవ్వాలనుకునే మెసేజ్‌లు, చెప్పాలనుకునే విషయాలను ప్రజలతో చెప్పుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా భావిస్తున్నాను. అందేకే నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాను. అది కూడా ఈ ఉగాది నుంచే’ అంటూ చిరంజీవి నిన్న ప్రెస్‌లో ఓ వీడియో విడుదల చేశారు. చిరు సోషల్ మీడియాలోకి ఎంటర్ కావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.