తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా జడ్జి! - MicTv.in - Telugu News
mictv telugu

 తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా జడ్జి!

April 16, 2019

ఇటీవలే పూర్తిస్థాయిలో ఏర్పాటైన తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి రాబోతున్నారు. అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.

First woman judge coming to Telangana high court as Allahabad high court judge justice sridevi transfer proposal under consideration

జస్టిస్‌ శ్రీదేవి బదిలీ దరఖాస్తుపై సానుకూలంగా స్పందించిన కొలీజియం ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్రం ఆ సిఫార్సును రాష్ట్రపతికి పంపుతుంది. ఆయన ఆమోదిస్తే బదిలీ జరుగుతుంది. ఆంధ్రపదేశ్‌కు చెందిన జస్టిస్‌ శ్రీదేవి 1986లో లా పట్టా పుచ్చుకున్నారు. 2005లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో జిల్లా సెషన్స్‌‌‌‌ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2018 నవంబర్‌ నెలలో అలహాబాద్‌ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. లెక్క ప్రకారం తెలంగాణ హైకోర్టుకు 24 మంది జడ్జీలు ఉండాలి. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌‌‌, 10 మంది జడ్జీలే ఉన్నారు.