భారత నేవీలోకి తొలి మహిళా పైలెట్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత నేవీలోకి తొలి మహిళా పైలెట్

November 22, 2019

మనదేశంలో మహిళలు పురుషులతో పాటు అన్నింటిలోనూ సమానంగా దూసుకెళ్తున్నారు. అతి కష్టం అనుకున్న పనులను కూడా అవలీలగా చేసేస్తూ తామేం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. అవకాశం చిక్కిన ప్రతీసారి సత్తా చాటుకుంటూనే ఉంటున్నారు. తాజాగా భారత నౌకాదళంలోకి కూడా తొలిసారి మహిళా పైలట్‌ రాబోతున్నారు. నేవీ లెఫ్టినెంట్‌గా శివాంగి డోర్నియర్ అనే యువతికి ఈ అవకాశం దక్కింది. 

Indian Navy.

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌‌కు చెందిన శివాంగి ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్నారు. వచ్చే నెల 2న ఆమె కోచిలో విధుల్లో చేరబోతున్నారు. నేవీలో ఉన్న విమానాలను ఆమె నడపనున్నారు. దీంతో నేవీలో తొలి మహిళా పైలట్‌గా రికార్డు సాధించారు. ఎజిమాలాలోని ఇండియన్ నావల్ అకాడమీలో 27 ఎన్‌ఓసి కోర్సు చేసి పైలెట్‌గా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు నేవీ ఏవియేషన్ బ్రాంచ్ మహిళలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్లు,కమ్యూనికేషన్ ,ఆయుధాలకు బాధ్యత వహించే విధులు నిర్వహించేవారు. తాజాగా లెఫ్టినెంట్ శివాంగికి విమానాలను నడిపే అవకాశం లభించింది.