ఇలా కూడా జరుగుతుంది.. ముక్కులో దూరిన చేప - MicTv.in - Telugu News
mictv telugu

ఇలా కూడా జరుగుతుంది.. ముక్కులో దూరిన చేప

November 14, 2019

ఈతకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఇటీవల సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలుడి ముక్కులోకి చేప దూరిన  సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

ముక్కులోకి చేపపిల్ల దూరడంతో శ్వాస తీసుకోవడానికి బాలుడు ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే వారు ఆ బాలున్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపు శ్రమించిన డాక్టర్లు.. ఎట్టకేలకు బాలుడి ముక్కులోంచి చేపపిల్లను బయటకు తీయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.