చేప చేప చిచ్చు ఎందుకు పెట్టావె...? - MicTv.in - Telugu News
mictv telugu

చేప చేప చిచ్చు ఎందుకు పెట్టావె…?

June 13, 2017

చేపల పులుసు అంటే నోరూరుతుంది.రేట్ తక్కువ..టేస్ట్ ఎక్కువ.అందుకే వారానికోసారైనా చేపలేనిదే ముద్ద దిగదు. మృగశిరకార్తె అయితే మస్ట్.ఆరోజు తిని తీరాల్సిందే.అక్కడ నుంచి మొదలయ్యే ఫిష్ పరంపర ఏడాది అంతా స్పైసీగా సాగుతుంది. కొర్రమీను,జెల్ల, మార్పుడుగాళ్లు,బంగారు తీగలు సండే వచ్చిదంటే రా రమ్మంటుంటాయి. కొనేదాకా అస్సలు వదలవు..ఇంతకీ చేపల గోల ఇప్పడు ఎందుకంటే… చెప్పకోవాల్సిన చిచ్చు పెట్టాయి. చేపలేంటీ..చిచ్చు తెలుసుకోవాలంటే ఈస్టోరీ చదవాల్సిందే..

గోదావరిపై రెండో వారధి నిర్మాణ పనుల నిమిత్తం బీహార్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కార్మికులు భద్రాచలానికి వలస వచ్చారు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బీహార్‌కు చెందిన కార్మికులు చేపలు తెచ్చుకొని వంట చేసుకొని తినటానికి సిద్ధమయ్యారు.ఈ చేపల కూర మాకూ కావాలని
తాగొచ్చిన వెస్ట్‌బెంగాల్‌కు చెందిన 12 మంది కార్మికులు కోరారు. బీహార్‌ కార్మికులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఇక్కడే చేపల చిచ్చు రాజుకుంది. మాటమాట అనుకున్నారు. అక్కడితో ఆగలేదు. కోపంతో ఊగిపోయిన వెస్ట్‌బెంగాల్‌ కార్మికులు కర్రలు, ఇనుప రాడ్లతో వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురిని సెక్యూరిటీ సిబ్బంది భద్రాచలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బీహార్‌కు చెందిన కార్మికులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. 12 మంది వెస్ట్ బెంగాల్ కార్మికులపై పలు సెక‌్షన్‌ల కింద కేసును నమోదు చేసినట్లు ఎస్సై హరిసింగ్‌ చెప్పారు. మొత్తానికి చేపలకూర రెండురాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాయి.