Fisherman's boat capsized in the sea
mictv telugu

వీడియో : ‘అసని’ ఎఫెక్ట్.. సముద్రంలో తిరగబడ్డ 60 మంది బోటు

May 10, 2022

Fisherman's boat capsized in the sea

అసని తుఫాన్ తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న 60 మందితో కూడిన మత్స్యకారుల బోటు అలల ధాటికి తిరగబడింది. తీరానికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన ఒడిషాలోని గంజాం జిల్లా ఛత్రాపూర్ సమీపంలోని ఆర్యపల్లి సముద్రతీరం వద్ద జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఒడిషా, ఏపీలోని తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

తీరం వెంబడి ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మే 13 వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఒడిషా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో తుఫాను బలహీనపడే అవకాశం ఉందని భువనేశ్వర్ వాతావరణ విభాగం ప్రకటించింది. ఏపీలోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.