fishermen caught amber grits in tamilnadu
mictv telugu

జాలర్లకు చిక్కిన రూ. 50 కోట్ల వాంతి

October 3, 2022

చేపల కోసం వల వేసిన జాలర్ల పంట పండింది. వారి వలలో రూ. 50 కోట్ల విలువైన తిమింగలం వాంతి చిక్కింది. దీని బరువు 38.6 కిలోలు ఉండడం గమనార్హం. తమిళనాడులోని కల్పాక్కం సమీపంలో ఈ విలువైన అండర్ గ్రిస్ చిక్కగా.. అచ్చిరుపాక్కం అటవీ అధికారులకు తెలియడంతో వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. చెంగల్పట్టు జిల్లా కడపాక్కం గ్రామనికి చెందిన ఇంద్రకుమార్, మాయా కృష్ణన్, కర్ణన్, శేఖర్ చేపల వేట కోసం శనివారం సాయంత్రం సముద్రంలోకి వెళ్లగా వారి వలకు ఇంత భారీ తిమింగళం వాంతి చిక్కింది. దీనిని పలు ఔషధాలతో పాటు సుగంధ లేపనాలలో వాడుతారు. అందుకే దీనికి ఇంత రేటు. సాధారణంగా కొన్ని తిమింగళాలు కొన్ని ఆహార పదార్ధాలను జీర్ణించుకోలేవు. వాటిని వాంతి చేసుకుంటాయి. తిమింగళం కడుపులోంచి బయటపడ్డ వాంతి.. సముద్రంలో ఒక ముద్దలా ఏర్పడుతుంది.