క్రీడాకారుల కెరీర్లో గాయాలు సహజం. మైదానంలో ఆడుతున్నప్పుడు గాయాల బారిన పడతారు. గేమ్‌లో గాయపడకుండా ఉండటం ఏ ఆటగాడికైనా చాలా కష్టం. కొన్నిసార్లు గాయాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని నెలలు తర్వాత మైదానంలో అడుగుపెడతారు. అయితే గాయం కారణంగా పూర్తిగా ఆటకే దూరమైన ప్లేయర్స్ ఉన్నారన్ని సంగతి మీకు తెలుసా? గాయాలతో చాలామంది కెరీర్ మధ్యలోనే ముగిసిపోయింది. అలాంటి ఐదుగురు క్రికెటర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిలిప్ హ్యూస్ (ఆస్ట్రేలియా)
క్రికెట్ లోకంలో అత్యంత విషాధమైన ఘటన ఫిలిప్ హ్యూస్ ది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో సౌత్ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య షెఫీల్ట్ షీల్డ్ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో హ్యూస్ తీవ్రంగా గాయపడి సిడ్నీ ఆస్ప్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ సమయంలో హ్యూస్ 63 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత సౌత్ వేల్స్‌కు చెందిన సీన్ అబాట్ అకస్మాత్తుగా బౌన్సర్ విసరడంతో బంతి నేరుగా హ్యూస్ మెడకు తాకింది. కానీ గాయం ప్రభావంతో అతను కోమాలోకి వెళ్లి సుమారు 22 రోజులు తర్వాత మరణించాడు.
మార్క్ బౌచర్ (దక్షిణాఫ్రికా)
9 జూలై 2012న, ఇమ్రాన్ తాహిర్‌తో జరిగిన స్థానిక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ కంటికి గాయమైంది. అతను హెల్మెట్ లేకుండా కీపింగ్ చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించి కంటికి శస్త్రచికిత్స చేశారు. తర్వాత బౌచర్ ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేకపోయాడు. బౌచర్ వికెట్లు వెనుక కీపింగ్ చేస్తూ 999 మందిని ఔట్ చేశాడు.
దక్షిణాఫ్రికా తరఫున 147 టెస్ట్ మ్యాచ్‌లలో 5515 పరుగులు చేశాడు. 295 వన్డేలో 4686 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బౌచర్ ఆడాడు.
నాథన్ బ్రాకెన్ (ఆస్ట్రేలియా)
నాథన్ బ్రాకెన్ ఎడమచేతి ఆస్ట్రేలియా వెటరన్ బౌలర్. మోకాలి గాయంతో అతడు పూర్తిగా క్రికెట్‌కు దూరమయ్యాడు. ఓ మ్యాచ్‌లో తగిలిన మోకాలి గాయాన్ని పట్టించుకోకుండా క్రికెట్ కొనసాగించాడు. చివరికి ఆ గాయం తీవ్రం కావడంతో రిటైర్ అవ్వాల్సి వచ్చింది. నాథన్ తన కెరీర్లో 5 టెస్టులు, 116 వన్డేలు మరియు 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 300 వికెట్లు తీశాడు.అంత బాగా ఆడిన అతడి కెరీర్ ఒక్కసారిగా ఆగిపోయింది.
క్రెయిగ్ కీస్వెటర్ (ఇంగ్లండ్)
క్రెయిగ్ కీస్వెటర్ ఇంగ్లండ్ ఆటగాడు. అతను 2010 మరియు 2013 మధ్య 71 మ్యాచ్‌లు ఆడాడు. జూలై 2014లో సోమర్సెట్ తరఫున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. డేవిడ్ విల్లీ వేసిన బంతి కీస్వెటర్ ముఖాన్నితాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీని ద్వారా అతని కంటి చూపు దెబ్బతిని క్రికెట్ కు దూరమయ్యాడు. చివరికి జూన్ 2015లో 27 సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్ ప్రకటించాడు.
సయ్యద్ సబా కరీం (ఇండియా)
సయ్యద్ సబా కరీం వికెట్ కీపర్‌గా భారత్ తరఫున 1 టెస్ట్ మరియు 34 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 2000 సంవత్సరంలో, ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు, కుంబ్లే వేసి బంతి సబా కంటికి తీవ్ర గాయమైంది. ఈ గాయంతో తర్వాత అతడు మరోసారి మైదానంలో దిగలేదు.