five detox drinks For Weight Loss And Boost immunity
mictv telugu

ఆరోగ్యానికి పరమౌషధం ఈ డిటాక్స్ వాటర్

December 26, 2022

detox water for immunity weight loss and more

డిటాక్స్ వాటర్…ఇది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట. చాలామంది దీన్ని తాగుతున్నాం, ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటున్నాం అని చెబుతున్నారు. అసలు ఈ డిటాక్స్ వాటర్ అంటే ఏంటి? మనం తాగే నీళ్ళకు, దీనికి ఏంటి తేడా. డిటాక్స్ వాటర్ అంటే మినరల్ వాటర్ లాగా వేరే వాటర్ ఏంటో, చాలా ఖరీదైన వ్యవహారం అనుకుంటున్నారా….అస్సలు కాదు. డిటాక్స్ వాటర్ ని మనం ఇంట్లోనే హ్ాపీగా చేసుకోవచ్చు. వీటిని చిన్నవాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకూ అందరూ తాగవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి అని చెబుతున్నారు నిపుణులు.

మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి డిటాక్స్ డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇవి జీవక్రియను మెరుగు పరచడాని కడుపులో ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎంతో సహయపడతాయి. శరీరంలో వ్యర్థాలను తొలగించేందుకు, శరీర అభివృద్ధికి పలు రకాల డిటాక్స్ వాటర్‌ను ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఈ డిటాక్స్ వాటర్‌ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

రోజంతా ఎనర్జీగా ఉండడానికి చాలా మంది టీ, కాఫీలు తాగుతుంటారు. కానీ వాటి బదులు ఈ డిటాక్స్ వాటర్ తాగితే మంచిదట.డిటాక్స్ వాటర్ అనేది ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. నీటితో నిండిన పండ్ల ముక్కతో పెద్ద నోటితో గాజు కూజాను నింపండి. కనీసం 5 నుండి 6 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా రెండు రోజుల పాటు నీటిని ఉంచుకుని తాగొచ్చు. డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరుగుతాయి. విషతుల్య పదార్థాలు బయటకు పోతాయి.డిటాక్స్ వాటర్ మన జీవక్రియ రేటును పెంచుతుంది. ఫలితంగా, కేలరీలు సులభంగా కరుగుతాయి. శరీరంలో వ్యాధి నిరోధకత కూడా పెరుగుతుంది. తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారు ఈ డిటాక్స్ వాటర్ తాగితే మేలు జరుగుతుంది.

డిటాక్స్ వాటర్‌లో అన్ని రకాల పండ్లను ఉపయోగించుకోవచ్చు. ఇది శరీరానికి కావాల్సిన నీటి అవసరాలను తీరుస్తుంది. డీహైడ్రేషన్‌ సమస్యలను తగ్గిస్తుంది. రోజంతా ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో కూర్చోవడం వల్ల పెద్దగా చెమట పట్టదు. దీనివల్ల శరీరం నుండి హానికరమైన లేదా విష పదార్థాలను బయటకు వెళ్లే అవకాశం ఉండదు. అలాంటి వారు డిటాక్స్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.డిటాక్స్ వాటర్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఈ డిటాక్స్ వాటర్‌ను రెగ్యులర్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది.

ఐదు రకాల డీటాక్స్ వాటర్ చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఇవి రెగ్యులర్ గా తీసుకుంటే మన శరీరంలో ఉండే చాలా ప్రాబ్లెమ్స్ కు చెక్ పెడతాము అని అంటున్నారు.

కొరియాండర్ వాటర్:

చెంచాడు ధనియాలను గ్లాసుడు నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో తాగాలి.

జీరా వాటర్:

జీలకర్రని కూడా చెంచాడు తీసుకుని నానబెట్టుకుని, ఉదయాన్నే ఖాళీ కడుపున తాగాలి.

దోస, పుదీనా, అల్లం, లెమన్ వాటర్:

దోస, పుదీనా, అల్లలాను ఫ్పెష్ గా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిన్న జార్ లో వేసుకోవాలి. ఇందులో నీళ్ళు పోసుకుని నిమ్మకాయ పిండుకోవాలి. ఇవి రోజంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగావచ్చును. మామూలు నీళ్ళు తాగే బదులు కూడా వీటిని తీసుకోవచ్చు. పుదీనా, అల్లం, కీరదోస, నిమ్మ అన్ని మనల్ని తాజాగా ఉంచుతాయి.

స్ట్రాబెర్రీ-లెమన్ వాటర్:

స్ట్రాబెర్రీస్, లెమన్ ముక్కలు గా కట్ చేసుకుని, నీళ్ళు పోసుకుని 4 లేదా 5 గంటలు వదిలేయాలి. తర్వాత ఆ ీరును తీసుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా చాలా రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది.

ఆపిల్-సినమన్ వాటర్:

ఆపిల్ ను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మన వేలు పొడవంత దాల్చిన చెక్కను వేసుకోవాలి. వీటిని కూడా కొంతసేపు వదిలేసి….వాటి సారం అంతా నీళ్ళల్లోకి ఇంకాక ఆ వాటర్ తాగాలి.

ఈ డిటాక్స్ వాటర్ నిజంగానే చాలా మంచివని చెబుతున్నారు డైటీషియన్స్. ఒకసారి తాగి చూడండి, తేడీ మీకే తెలుస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి : 

బంగారం కంటే ఎక్కువ విలువైన పుట్టగొడుగులు

రెండో పెళ్లి చేసుకున్న వారికి ఈ హోటల్‌లో స్పెషల్ డిస్కౌంట్