Home > Featured > బొటనవేలితో టిక్‌టాక్ స్టారయ్యాడు.. సైజు ఎంతంటే.. 

బొటనవేలితో టిక్‌టాక్ స్టారయ్యాడు.. సైజు ఎంతంటే.. 

ప్రతిభ వున్నవారు ఎందరో ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వస్తున్నారు. తమ ప్రతిభను నిరూపించుకుని సెలెబ్రిటీలు అయిపోతున్నారు. కానీ, ఓ యువకుడు ఇందుకు భిన్నంగా తన బొటనవేలుతో వెలుగులోకి వచ్చాడు. సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు. టిక్‌టాక్‌లో అతను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఇంతకీ అతని బొటనవేలు ప్రత్యేకత ఏంటనే కదా మీ డౌటు. అవున చాలా ప్రత్యేకమైందే అతని బొటనవేలు. ఎవరికైనా బొటనవేలు సైజు చిన్నగానే వుంటుంది. చేతికున్న అన్నీ వేళ్లల్లో చిన్నగా వుంటుంది. కాకపోతే కొంచెం లావుగా వుంటుంది. కానీ, ఇతనికి మాత్రం ఆ వేలే మిగతా వేళ్ల కన్నా పెద్దగా వుంది. ఏకంగా ఐదు అంగుళాల పొడవు వుంది.

మసాచుసెట్స్‌లోని వెస్ట్‌పోర్టుకు చెందిన విద్యార్థి జాకోబ్ పినా తన బొటనవేలు తనకు చాలా ప్రత్యేకం అంటున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పొడవైన బొటనవేలు చూపిస్తూ పోస్టు చేసిన ఓ వీడియో సెన్సేషన్‌గా మారింది. రాత్రికి రాత్రి అతడిని సోషల్ మీడియా సెన్సేషన్‌గా మార్చేసింది. అతడి వేలిని చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. ఇంతపెద్ద వేలా అని ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోతో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏకంగా 15వేలు పెరిగింది. తన బొటనవేలు తనను సెలబ్రిటీని చేయడం నమ్మలేకుండా వుందని జాకోబ్ అంటున్నాడు.

Updated : 2 Sep 2019 9:28 AM GMT
Next Story
Share it
Top