Five JDU MLAs joined BJP in manipur
mictv telugu

నితీష్ కుమార్‌కి షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు

September 3, 2022

Five JDU MLAs joined BJP in manipur

ఎన్డీఏతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పొత్తుతో బీహార్‌లో సీఎం పదవి కాపాడుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీకి మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు బీజేపీలో చేరిపోయారు.

వారు చేరిన వెంటనే స్పీకర్ కూడా ఆ మేరకు ధృవీకరించి ప్రకటన జారీ చేశారు. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగాయి. బీజేపీ 32 స్థానాల్లో, జేడీయూ ఆరు స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు బీహార్‌లో రాజకీయ సమీకరణాలు మారడంతో దానికి తగ్గట్టు బీజేపీ పావులు కదిపింది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌లో 2019లో ఎన్నికలు జరుగగా, ఏడుగురు జేడీయూ సభ్యులు గెలిచారు. అందులో ఆరుగురు చాలా ముందే బీజేపీలో చేరిపోగా, మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అటు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు.