పండగపూట విషాదం.. ఇల్లు కూలి ఐదుగురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పండగపూట విషాదం.. ఇల్లు కూలి ఐదుగురు మృతి

October 25, 2020

ఇల్లు

విజయదశమి పండుగ పూట తెలంగాణ జిల్లాలో విషాదం జరిగింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో శనివారం అర్ధరాత్రి ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇంటి యజమాని కోమటి చెవ్వ నరసింహ సంవత్సరం క్రితం మరణించారు. ఆయన భార్య మణెమ్మ గ్రామంలో నివసిస్తున్నారు. 

ఆమె నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనుమల్లు, మనుమరాళ్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు. శనివారం కోమటి చెవ్వ నరసింహ సంవత్సరీకం కావడంతో వారంతా స్వగ్రామానికి వచ్చారు. ఆ కార్యక్రమం ముగియగా రాత్రి భోజనాల చేసి 9 మంది ఓ గదిలో పడుకున్నారు. అందరు నిద్రిస్తుండగా అర్ధరాత్రి గది పైకప్పు కూలింది. ఈ ఘటనలో మణెమ్మతోపాటు ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, అక్షయ అక్కడిక్కడే మృతి చెందారు. మూడో కుమారుడు కుమారస్వామి తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కుమారస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.