Five new features in WhatsApp
mictv telugu

వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్లు.. గోప్యతకు మరింత ప్రాధాన్యం

July 7, 2022

Five new features in WhatsApp

వినియోగదారులు కోరుకున్న సౌకర్యాలు కల్పించి వారి మన్ననలు పొందడంలో వాట్సాప్ ముందువరుసలో ఉంటుంది. ఇప్పటికే గోప్యతకు సంబంధించి అనేక ఫీచర్లను తీసుకొచ్చిన ఆ సంస్థ తాజాగా మరో సౌకర్యాన్ని తీసుకొస్తోంది. వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు యూజర్ ఐకాన్ కింద సదరు వ్యక్తి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఉన్నారా? అనే విషయం సూచిస్తుంది. అంతేకాక, ఆన్‌లైన్‌లో ఎంతసేపటి క్రితం ఉన్నారు అనే విషయాలు మనకు తెలుస్తాయి.

ఇప్పుడు వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచరుతో దానిని ఎదుటి వ్యక్తికి కనపడకుండా చేయవచ్చు. మనం ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరికీ తెలియకుండా వాట్సాప్ ఈ ఆధునిక ఫీచరు తెస్తోంది. ఇంకా మెసేజులకు రిప్లై ఇచ్చేటప్పుడు కస్టమర్లు వాడుకునేందుకు ఇప్పటివరకు ఆరు ఎమోజీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని అన్‌లిమిటెడ్‌గా పెంచేసింది. ఇంకో ఫీచరేంటంటే.. ఇప్పటి వరకు మనం పంపే ఫోటోలను నచ్చినట్టుగా ఎడిట్ చేసేందుకు మీడియా ఎడిటర్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు దానికి అదనంగా ఫోటోలను బ్లర్ చేసే అవకాశం రాబోతుంది. ఇక కొత్తగా వాట్సాప్ డౌన్‌లోడ్ చేసుకునే యూజర్లకు కత్తిలాంటి ఫీచర్ వచ్చింది. ఇంతకు ముందు మన ఫోన్ నెంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వచ్చేది. దానిని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పూర్తయ్యేది. ఇప్పుడు ఆ పరిస్తితి లేకుండా ఆటోమేటిక్ ఫ్లాష్‌కాల్స్ వెరిఫికేషన్ ప్రక్రియ రానుంది. కాగా, ఈ సౌలభ్యం ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.