సిద్ధిపేట జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి కాలువలో దూసుకెళ్లగా ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. విషమంగా ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.