ఐదు రూపాయల క్యారీ బ్యాగుకు.. రూ.20 వేల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

ఐదు రూపాయల క్యారీ బ్యాగుకు.. రూ.20 వేల జరిమానా

May 17, 2022

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న సిటీ సెంటర్‌మాల్‌లోని లైఫ్‌ స్టైల్‌ దుస్తుల షోరూంకి జిల్లా కన్జ్యూమర్‌ డిస్పూట్స్‌ రెడ్రెసల్‌ కమిషన్‌ రూ.20 వేల జరిమానా విధించింది. షాపింగ్ కోసం వచ్చే కస్టమర్లకు ఉచితంగా ఇవ్వాల్సిన క్యారీ బ్యాగ్‌కు షాపు యాజయాని డబ్బులు వసూలు చేస్తున్నాడని ఓ బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించారు. దాంతో వాదోపవాదనలు విన్న కన్జ్యూమర్‌ డిస్పూట్స్‌ రెడ్రెసల్‌ కమిషన్‌ లైఫ్‌ స్టైల్‌ దుస్తుల షోరూంకి రూ.20 వేల జరిమానా విధించింది.

ఇటీవలే ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి సిటీ సెంటర్‌మాల్‌కు వెళ్లారు. అందులో ఉన్న లైఫ్‌ స్టైల్‌ దుస్తుల షోరూంలో షాపింగ్ చేశారు. బిల్లు చెల్లించే సమయంలో క్యారీ బ్యాగ్‌కు ప్రత్యేకంగా రూ.5 వసూలు చేశాడు. దాంతో ఆ వ్యక్తి ఉచితంగా ఇవ్వాల్సిన క్యారీ బ్యాగుకు డబ్బులు ఎందుకు వసూలు చేశారంటూ ప్రశ్నించాడు. దాంతో షాపు యాజమాని డబ్బులు ఇస్తేనే క్యారీ బ్యాగు ఇస్తాం, ఉచితంగా ఇవ్వమంటూ ఆగ్రహించాడు. దాంతో ఆ కస్టమర్.. కన్జ్యూమర్‌ డిస్పూట్స్‌ రెడ్రెసల్‌ కమిషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. తాజగా కేసును విచారించిన కమిషన్ షాప్ యాజమానిపై రూ.20 వేల జరిమానా విధించింది.