Five star hotel for pets..where else
mictv telugu

పెట్స్ కోసం ఫైవ్‌స్టార్ హోటల్..ఎక్కడంటే

August 11, 2022

Five star hotel for pets..where else

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు తమ తమ ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఏదో ఒక జంతువును (కుక్కను, పిల్లిని, పావురం) పెంచుకుంటున్నారు. ముఖ్యంగా కుక్కలను పెంచుకునే వారు ఉదయం, సాయంత్రం వాటిని బయటికి తీసుకెళ్లి కొన్ని గంటలపాటు ఆహ్లాద వాతావరణంలో తిప్పుతారు. కొన్ని సందర్భాల్లో వారు ఏదైనా పనిమీద బయటికెళ్లినప్పుడు వాటిని ఇళ్లలోనే ఒంటరిగా వదిలి వెళ్తుంటారు. మరికొంతమంది వారితోపాటే వాటిని తీసుకెళ్తుంటారు.

కానీ, అన్ని చోట్లకు అన్నీ సందర్భాల్లో తమతోపాటే పెట్స్‌ను తీసుకెళ్లడం కుదరదు. దాంతో తప్పని పరిస్థితుల్లో వాటిని ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి వెళ్తుంటారు. ఆ తర్వాత ఇంట్లో తమ పెట్స్‌ను ఒంటరిగా వదిలి వచ్చామే? దానికి ఆహారం ఎలా? అని పదే పదే ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించే వారికోసం సౌదీ అరేబియాకు చెందిన ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. పెట్స్ కోసం ఏకంగా ఓ ఫైవ్‌-స్టార్ హోటల్‌‌ను ఓపెన్ చేసింది. ప్రస్తుతానికి ఈ హోటల్‌లో పిల్లులకు మాత్రమే అనుమతి ఉందని, పనిపై బయటికి వెళ్లేవారు, షాపింగ్ చేసేవారు, వేరే ఊరికి వెళ్లే వాళ్లు తమ పెట్స్‌ను తమ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వదిలి వెళ్లొచ్చని ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక అంతే, విషయం తెలుసుకున్న పెట్స్ ఓనర్లు..తమ పెట్స్‌ను ఫైవ్‌స్టార్ హూటల్‌లో వదిలివెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే.. పిల్లులకు అక్కడి సిబ్బంది ఆహారం పెట్టడం, ఆడించడం వంటివి చేస్తున్నారు. ఫైవ్‌స్టార్ హోటల్ యజమాని హుదా అల్ ఒతైబీ మాట్లాడుతూ..”పెట్స్ యాజమానుల కోసం వారు పెంచుకూనే పెట్స్ కోసం ఈ ఫైవ్‌స్టార్ హోటల్‌ను ఓపెన్ చేశాను. యాజమాన్యం కోసం ఒక మొబైల్ యాప్‌ను కూడా క్రియేట్ చేశాను. ఈ యాప్ ద్వారా హోటల్‌లో మీ పెట్స్‌ను నేరుగా చూసుకోవడం, వివరాలు తెలుసుకోవడం లాంటి సౌకర్యాలు ఉన్నాయి. పెట్స్‌కు ఈ హోటల్ ఒక రిసార్ట్‌లా ఉంటుంది” అని తెలిపారు.