ఫైవ్ స్టార్ హోటల్లో కీచక పర్వం.... - MicTv.in - Telugu News
mictv telugu

ఫైవ్ స్టార్ హోటల్లో కీచక పర్వం….

August 18, 2017

మహిళలపై రోజురోజుకూ  అఘాయిత్యాలు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  ఫైవ్ స్టార్ హోటల్ లో నాగరికత, సంస్కృతి తెలిసిన మనుషులు , కల్చర్ తెలిసిన వాళ్లు ఉంటారని భావిస్తాం.  కాని అలాంటి మనుషులు ఉండే చోట కూడా వికృతాలు జరుగుతున్నాయి. కొందరు చదువుకుని ఉన్నత స్థానంలో ఉండి కూడా నీచంగా ప్రవర్తిస్తున్నారు.

ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేసే ఉద్యోగినిపై అదే హోటల్లోని  ఎగ్జిక్యూటివ్ మేనేజర్ తన గదిలో చీరలాంగి  ఆసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో ఉద్యోగి ఈ కీచకాన్ని చూస్తూ ఉన్నాడే కాని అడ్డుకోవడానికి యత్నించలేదు. బాధితురాలు ఎలాగోలా గదిలోంచి బయపడింది. అయితే ఆమె కష్టాలు అంతటితో ఆగిపోలేదు. సెక్యూరిటీ మేనేజర్ పవన్ దనియా కూడా ఆమెను బలవంతంగా తీసుకెళ్లి కారులో తోయడానికి ప్రయత్నించాడు. ఈ దారుణం గత నెల 29న జరిగింది. సీసీటీవీ ఫుటేజీలతో తాజాగా వెలుగు చూసింది.

తన పుట్టిన  రోజునే ఈ కీచకుల బారినపడ్డానని బాధితురాలు తెలపింది. ఈ ఘటనపై ఆమె మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయంలో హోటల్ యాజమాన్యం కూడా అన్యాయంగా ప్రవర్తించింది. బాధితురాలని ఉద్యోగం నుంచి తొలగించింది.

 

http://www.ndtv.com/delhi-news/hotel-employees-sari-pulled-by-senior-she-complained-and-was-fired-1739042?pfrom=home-lateststories