హాస్టల్లో గొడవ..ఐదుగురు విద్యార్థినులు ఆత్మాహత్యాయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

హాస్టల్లో గొడవ..ఐదుగురు విద్యార్థినులు ఆత్మాహత్యాయత్నం

November 20, 2022

ఐదుగురు గురుకుల విద్యార్థినులు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డం వరంగల్ జిల్లాలో కలకలం రేగింది. హన్మకొండ మండలంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల హాస్టల్లో విద్యార్థినులు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినులు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకలతో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ములుగు జిల్లాకు చెందిన బీసీ బాలికల గురుకుల హాస్టల్ ను అధికారులు ఆరెపల్లి వద్ద ఉన్న ఓ భవనంలో నిర్వహిస్తున్నారు. హాస్టల్లోని వారు కాకుండా ఇతర విద్యార్థినులు హాజరు కావడంతో అధికారులు వారిని మందలించారు. ఈ క్రమంలో వారిలో వారు గొడపడ్డారు. దీంతో మనస్థాపం చెందిన ఐదుగురు విద్యార్థినులు ఫినాయిల్ తాగారు. ఈఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు.