జగన్ ఆఫర్.. ప్లాస్మా దానం చేస్తే రూ. 5000 - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ఆఫర్.. ప్లాస్మా దానం చేస్తే రూ. 5000

July 31, 2020

Five thousand rupees for plasma donors.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కరాళ  నృత్యం చేస్తోంది. సగటున రోజు ఐదు వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ నివారణా చర్యల్లో భాగంగా ఈరోజు క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా సంబంధిత శాఖల అధికారుల హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుంచి కోలుకొని ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళను ప్రోత్సహించాలని తెలిపారు. ప్లాస్మా దాతలకు 5వేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ఈ డబ్బు వారికీ పౌష్టిక ఆహరం తీసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

‘రాష్ట్రంలో బెడ్ల కొరత ఏర్పడకూడదు. హెల్ప్‌ డెస్క్‌ల్లో ఆరోగ్య మిత్రలను నియమించండి. రాష్ట్రంలోని 138 కరోనా ఆస్పత్రుల యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. హెల్ప్‌ డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలి. హెల్ప్‌ డెస్క్‌ తో చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. జీజీహెచ్‌ లాంటి ఆస్పత్రులపై మరింత శ్రద్ధపెట్టాలి. కాల్ ‌సెంటర్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా.. చూడండి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి. సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యా కానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలి. దీని కోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయండి.’ అని సీఎం జగన్ తెలిపారు.