ఇలాంటి వార్తలు విదేశాల నుంచో లేదా ఉత్తర భారత దేశం నుంచో వస్తాయనుకునేవాళ్లం. కానీ మన హైదరాబాదులోనూ వీటికి కొదవ లేదని నిరూపించింది ఈ సంఘటన. ఒకే వ్యక్తి ఐదుగురు భార్యలను ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకొని బిచాణా ఎత్తేశాడు. ఎంత వెతికినా దొరక్కపోవడడంతో చివరికి భార్యలు విడివిడిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఐదుగురు భార్యలు వెతుకుతుంది ఒక్కరినే అని తేలడంతో పోలీసులు షాకయ్యారు. అందుతున్న సమాచారం మేరకు నిందితుడు సనత్ నగర్, బంజారా హిల్స్ ప్రాంతాలలో నివాసముండే ఐదుగురు మహిళలను ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడాడు.
పెళ్లి తర్వాత కొంత కాలం ఉండి నగదు, విలువైన సామాగ్రితో సడెన్‌గా మాయమయ్యేవాడు. దీంతో అతని భార్యలు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారికి మీ అందరి భర్త ఒక్కడే అని క్లారిటీ ఇచ్చారు. దీంతో మోసపోయామని గ్రహించిన భార్యలు.. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తమ ముద్దుల భర్తను వెతికే పనిలో పడ్డారు. తమ భర్త నిజ స్వరూపం తెలియడంతో కచ్చితంగా ఇంకో మహిళను ప్రేమ పేరుతో లొంగదీసుకొని పెళ్ళి చేసుకునే ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇటు పోలీసులు కూడా తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.