కరోనాతో ఐదేళ్ల బాలుడి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో ఐదేళ్ల బాలుడి మృతి

April 5, 2020

Five-year-old child passed away with coronavirus

కరోనా వైరస్ పిల్లలపై ఎలాంటి ప్రమాదం చూపదని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. పిల్లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. దీంతో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, క్రమంగా కరోనా వైరస్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తాజాగా యూకేలో కరోనా వైరస్ సోకి ఐదేళ్ల బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ లో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 41,903కు పెరిగింది. దీంట్లో 3,735 కేసులు ఒక్క శనివారం రోజే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో 4,313 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. శనివారం మరణించినవారిలో 40 మందికి ఎలాంటి ముందస్తు అనారోగ్య సమస్యలు లేవని ఇంగ్లండ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ వెల్లడించింది.