ఐదేళ్ల తర్వాత అమ్మను కలిసిన సీఎం.. 28 ఏళ్లకి సొంతూరుకు - MicTv.in - Telugu News
mictv telugu

ఐదేళ్ల తర్వాత అమ్మను కలిసిన సీఎం.. 28 ఏళ్లకి సొంతూరుకు

May 4, 2022

ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి రికార్డు సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్.. దాదాపు ఐదేళ్ళ తర్వాత తన తల్లిని మంగళవారం కలుసుకున్నారు. తన మేనల్లుడి పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ క్రమంలో 28 ఏళ్ల తర్వాత తన సొంతూరును సందర్శించారు. అంతేకాక, ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిని కలవడం ఇదే తొలిసారి. ఈ అరుదైన దృష్యం ఆదిత్యనాథ్ సొంత గ్రామమైన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పౌరీలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా యోగీ తల్లి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఇదికాక, 2020 ఏప్రిల్‌లో కన్న తండ్రి చనిపోతే అంత్యక్రియలకు కూడా యోగీ హాజరుకాలేదు. దీనిపై పలువురు విమర్శలు చేయగా, ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ తండ్రిగా ఉండాల్సిన తను, కరోనా నిబంధనలకు ఉల్లంఘించడం ఏంటని విమర్శలను గట్టిగా ప్రశ్నించారు. కాగా, ప్రధాని మోదీలాగే యోగీ కూడా కుటుంబానికి దూరంగా ఉంటారు.