భూమి గుండ్రంగా లేదని.. రాకెట్‌ ఎక్కి.. - MicTv.in - Telugu News
mictv telugu

భూమి గుండ్రంగా లేదని.. రాకెట్‌ ఎక్కి..

March 26, 2018

కొందరు ఉంటారు. ఎవరేం చెప్పినా వినరు. స్వయంగా కనుక్కుని, విడమరచి చూసి తెలుసుకుంటేనే వారికి తృప్తి. అమెరికాకు చెందిన 61 ఏళ్ల మైక్ హుగ్ కూడా అలాంటివాడే. భూమి గుండ్రంగా ఉందని స్కూల్లో చెబితే నమ్మలేదు. పెద్దయ్యాకా నమ్మలేదు. భూమి గుండ్రంగా ఉంటే, అది తిరుగుతూ ఏంటే మనం విశ్వంలో పోయేవాళ్లం కదా అని ఈయనకు డౌటు. దాన్ని తీర్చుకోవడానికి పెద్ద ప్రయోగం చేశాడు.

ఎళ్లతరబడి కష్టపడి ఒక రాకెట్ తయారు చేసుకున్నాడు. మైక్ వెర్రిమొర్రి చేష్టలను చూసి జనం అతన్ని మ్యాడ్ మైక్ అని గేలిచేసేవారు. అయితే ఏదో ఒక రోజు తన ‘బల్లపరుపు’ సిద్ధాంతం రుజువు అవుతుందని మైక్ ఆశ. తన ప్రయోగంతో మొత్తం ప్రపంచ నివ్వెర పోతుందని శపథం పట్టి  ప్రయోగాలు చేశాడు. సొంత ఖర్చుతో, ఎవరి సాయం లేకుండా స్టీమింజన్ రాకెట్ తయారు చేసుకున్నాడు.

తన మోటారు వాహనాన్ని రాకెట్ లాంచింగ్ ప్యాడ్‌గా రూపొందించుకున్నాడు. ఈ నెల 24న లాస్ ఎంజిలెస్‌లోని మొజావే రాళ్ల ఎడారిలో రాకెట్లో కూర్చుని రివ్వున నింగికెరిగాడు. గంటకు 350మైళ్ల వేగంతో  ఎగసిన రాకెట్ 1,875 అడుగుల ఎత్తుకు వెళ్లి మోటుగా ల్యాండైంది. అయితే కింద రాళ్లు ఉండడంతో రాకెట్ కింది భాగం దెబ్బతింది. మైక్ కూడా చిన్నాపాటి గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.

అయినా అతడు పట్టుదల వీడడం లేదు. ‘నేను రాకెట్ చేయలేనని, పైకి పోలేనని అన్నారు. ఇప్పుడు వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాను. నేను భూమి గుండ్రంగా ఉందని నిరూపించాలంటే 68 మైళ్ల ఎత్తుకు వెళ్లాలి.. అందుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తాను.. ’ అని మైక్ అన్నాడు.