మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? ఎంత బరువు తగ్గాలనుకున్నా తగ్గలేకపోతున్నారా.? అయితే అవిసె గింజలు తినడం వలన ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. వీటిలో పీచు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి.
-ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని పండ్ల రసంలో కలుపుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు.
-ప్రూట్ సలాడ్ , వెజిటబుల్ సలాడ్స్ పై అవిసె గింజలు చల్లుకుని తింటే ఆరోగ్యం బావుంటుంది.
-చికెన్, కోడిగుడ్లు వండినప్పుడు అందులో అవిసె గింజల పొడి వేయాలి. దీంతో ఆహారాన్ని తింటే బరువు తగ్గుతారు.
-ఓట్స్ ను ఉడికించి వాటిపై అవిసె గింజలు చల్లకుని తింటే బరువు తగ్గుతారు.
-చికెన్, వెజిటబుల్ సూప్ లో అవిసె గింజల పొడి చల్లుకుని తాగితే ఫలితం ఉంటుంది.
-బ్రెడ్, కుకీస్ తిన్నప్పుడు మధ్యలో అవిసె గింజలు పెట్టుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.
-మజ్జిగ, పెరుగులో అవిసె గింజల పొడిని కలుపుకుని తింటే ఈజీగా బరువు తగ్గుతారు.