పారిపోలే, అమెరికాలో ఉంటున్న.. రాడిసన్ బ్లూ కిరణ్ - MicTv.in - Telugu News
mictv telugu

పారిపోలే, అమెరికాలో ఉంటున్న.. రాడిసన్ బ్లూ కిరణ్

April 11, 2022

fghfgh

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌‌పై పోలీసులు దాడి చేసి, 142 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే, ఈ ఘటనలో నిందితుడిగా ఉన్నా.. కిరణ్‌ రాజు పెనుమత్స నుంచి పోలీసులకు ఈ–మెయిల్‌ వచ్చింది. ఆ ఈ-మెయిల్‌లో ”నేను సదరు పబ్‌లో భాగస్వామిని. పెట్టుబడి పెట్టాను. కానీ, కార్యకలాపాలను పర్యవేక్షించట్లేదు. నా సోదరికి ఆపరేషన్‌ అయింది. కావున కొన్ని నెలలుగా నేను అమెరికాలో ఉంటున్నా” అని కిరణ్‌ రాజు పేర్కొన్నారు.

అయితే, ఈ-మెయిల్ పంపించడానికి గల ప్రధాన కారణం.. గతకొన్ని రోజులుగా పబ్‌పై దాడి జరిగిన అనంతరం కిరణ్‌ రాజు పారిపోయినట్లు మీడియాలో కథనాలు వస్తుండడంతో అతడు స్పందిస్తూ.. తాను పరారీలో లేనని.. అమెరికాలో ఉన్నానని ఈ–మెయిల్‌ ద్వారా పోలీసులకు వివరణ ఇచ్చాడు. అంతేకాకుండా తాను హైదరాబాద్‌కు వచ్చిన తర్వా త పోలీసుల ఎదుట హాజరై, పూర్తి వివరణ ఇస్తానన్నారు.

దీంతో ఈ మెయిల్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. సాంకేతిక అంశాలపై ఆరా తీస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి కిరణ్‌ దీన్ని పంపారో పరిశీలిస్తున్నారు. కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు అర్జున్‌ వీరమాచినేని కోసం గాలింపు కొనసాగుతోంది. ఈయన పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర నిందితులు అభిషేక్‌ ఉప్పల, అనిల్‌కుమార్‌ల కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది.