తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈనెల 24 నుంచి విమనాల పండగ మొదలు కాబోతుంది. గతకొన్ని రోజులుగా ప్రజలు ఈ విమానాల పండగ ఎప్పుడు ప్రారంభమౌతుంది. ఎప్పుడెప్పుడు చూడాలి అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ షోకు రంగం సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. ‘వింగ్స్ ఇండియా – 2022’ పేరుతో ఈనెల 24 నుంచి బేగంపేట ఎయిర్పోర్టులో ఎయిర్ షోను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు వేదికగా పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నాలుగు రోజుల పాటు నగరవాసులను కనువిందు చేయనున్నాయి అని పేర్కొన్నారు.
The stage is set for Team Sarang @sarang_iaf to spread its feathers in the skies of #Hyderabad at #WingsIndia2022. The finest from the Indian Air Force @IAF_MCC will dazzle all attendees at Asia’s largest event on Civil Aviation. pic.twitter.com/ZwW8IhtvnS
— Wings India 2022 (@WingsIndia2022) March 14, 2022
అంతేకాకుండా ఈ ప్రదర్శనల్లో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొనున్నారని, అదేవిధంగా ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ హెలికాప్టర్ల షోను ఎలా చూడాలి? రిజిస్ట్రేషన్ ఉందా? ఉంటే ఎలా చేసుకోవాలి? అనే విషయాలను అధికారులు వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ ఇలా….
కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తుండటం విశేషం. విమానాల ప్రదర్శనలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు www.wings-india.co.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి మూడురోజులు ప్రముఖులు, వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.