శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు..ఆపచారమంటున్న భక్తులు  - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు..ఆపచారమంటున్న భక్తులు 

February 5, 2020

dfgb

తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గత మూడు రోజులుగా ఓ విమానం తిరగడాన్ని భక్తులు అపచారంగా భావిస్తున్నారు. ఆగమశాస్త్రాలకు విరుద్దంగా శ్రీవారి ఆలయంపై విమానం తిరగడాన్ని తప్పుబడుతున్నారు.నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీటీడీ అధికారులు చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ విమానం ఎక్కడిది ఎందుకు అలా తిరిగిందనే కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు. 

హిందువులు ఎంతో విశ్వసించే తిరుమల శ్రీవారి ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.కొండపై దేవతలు విహరిస్తుంటారని భక్తుల నమ్మకం. అందుకే అక్కడి ఆగమ శాస్త్రాల ప్రకారం ఆలయంపై రాకపోకలపై నిషేదం విధించారు.  ఆ ప్రదేశం నో ఫ్లైయింగ్‌ జోన్‌‌గా ప్రకటించారు. అయినప్పటికీ ఇలా విమానం చక్కర్లు కొట్టడంతో అపచారంగా భావిస్తున్నారు. కాగా ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉండటం వల్ల విమానాలు తిరిగితే అవి పేలిపోతాయనే ప్రచారం కూడా ఉంది . బ్రిటీష్ కాలంలో ఇలా రెండు విమానాలు ఈ ప్రాంతంలో  ఇలాంటి ప్రమాదాలు జరిగాయనే ప్రచారం కూడా ఉంది.