అదిరిందయ్యో.. విమానానికి కూడా మాస్క్ తప్పలేదు - MicTv.in - Telugu News
mictv telugu

అదిరిందయ్యో.. విమానానికి కూడా మాస్క్ తప్పలేదు

October 13, 2020

nhmgm

మాస్క్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషిలోనూ ఒక భాగమైపోయింది. బయటకు వెళ్లాలంటే చాలా మంది దాన్ని వెంట తీసుకొని వెళ్తున్నారు. కరోనా రాకుండా ప్రతి ఒక్కరికి మాస్క్ మొహానికి వచ్చి చేరింది. కొంత మంది తమ పెంపుడు జంతువులకు కూడా మాస్కులు పెట్టారు.ఇప్పుడు విమానాల వంతు వచ్చింది. ఓ విమానానికి ఏకంగా భారీ మాస్కు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 

ఇండోనేషియాకు చెందిన క్యారియర్ గరుడ గతవారం ఐదు విమానాలను ఫేస్‌మాస్క్‌లతో నింపేసింది. వాటి ముక్కు భాగం వద్ద నీలిరంగులో మాస్క్‌ల  పెయింట్ చేశారు. నిజంగానే ఆ విమానం మాస్క్ ధరించిందా అనే అనుమానం కలిగేలా రంగులు అద్దారు. ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వాడలని అవగాహన కల్పించే విధంగా దీన్ని వేశారు. 60 మంది పేయింటర్లు దాదాపు 120 గంటలపాటు శ్రమించి విమానాలకు రంగులు వేశారు. ఈ ఆలోచన చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహమ్మారిని కట్టడి చేయాలంటే ఇంకా కొంత కాలం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని పేర్కొంటున్నారు.