ఫ్లిప్‌కార్ట్‌ అదిరేపోయే ఆఫర్.. రూ.499కే స్మార్ట్ టీవీ - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లిప్‌కార్ట్‌ అదిరేపోయే ఆఫర్.. రూ.499కే స్మార్ట్ టీవీ

May 16, 2022

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ తమ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన తగ్గింపులు చేసినట్లు పేర్కొంది. వీయూ ప్రీమియం 80 సెంటీమీటర్ల (వీయూ ప్రీమియం టీవీ 80సె.మీ (32 ఇంచుల) హెచ్‌డీ రెడీ లెడ్ స్మార్ట్ టీవీ) టీవీపై భారీ ఆఫర్లు అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది.

”వీయూ ప్రీమియం టీవీ 80 సెం.మీ (32 అంగుళాల) హెచ్‌రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ లాంఛింగ్ ధర రూ. 20,000. ఈ టీవీపై 37 శాతం తగ్గించాం. ప్రస్తుతం దీని ధర రూ. 12,499లే. ఈ టీవీని కొనుగోలు చేసేటప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, 10 శాతం తగ్గింపు (వెయ్యి రూపాయల) లభిస్తుంది అంటే రూ.11,499కే కొనుగోలు చేయేచ్చు. వీయూ ప్రీమియం టీవీ 80 సెం.మీ (32 అంగుళాల) హెచ్ రెడీఎల్ ఈడీ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. మీ పాత స్మార్ట్ టీవీకి బదులుగా కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం వల్ల 11 వేల రూపాయల వరకు ఎక్సేంజ్ ఆఫర్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే, కేవలం రూ.499కే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.”

ఈ స్మార్ట్ టీవీలో.. రెండు స్పీకర్లు, 20W సౌండ్ అవుట్ పుట్స్, 32 అంగుళాల డిస్‌ప్లే, 1,366 x 768 పిక్సెల్ హెచ్‌డీ రిజల్యూషన్, 60Hzరిఫ్రెష్ రేట్‌తో వస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. నెబ్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లతో పాటు య్యూట్యూబ్ వంటి ప్లాట్ ఫారమ్‌లను లాంటి ఎన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయని పేర్కొంది.