ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల పండగ.. ఇప్పటికే 80 వేల ఉద్యోగాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల పండగ.. ఇప్పటికే 80 వేల ఉద్యోగాలు..

October 8, 2018

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు దసరా పండగ సందర్భంగా నిరుద్యోగులకు సువర్ణ అవకాశం అందించాయి. ఆర్డర్లు వెల్లువెత్తుతుండడంతో రెండూ కలపి ఇప్పటికే మనదేశంలో 80 వేల మందిని తాత్కాలిక కొలువుల్లోకి తీసుకున్నాయి. పరోక్షంగా మరికొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాయి. తాము పండగ కోసం 30 వేల సీజనల్ ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫ్లిప్‌కార్ట్ వర్గాల చెప్పయి. సప్లయి చైన్‌, లాజిస్టిక్స్‌ ఆపరేషన్లలో వీరికి పని ఉంటుంది.

ttt

అమెజాన్‌కు గట్టి పోటీ ఇవ్వడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన, త్వరిత సేవలు అందించేందుకు గతంలోనూ ఫ్లిప్‌కార్ట్‌ ఇలాంటి ఉద్యోగాలు కల్పించింది. తాజా బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను అక్టోబర్‌ 10 నుంచి 14 వరకు సాగనుండడంతో ఫ్లిప్‌కార్ట్‌ 30 వేల కొలువులు అందించింది. దాని విక్రయ భాగస్వాములు కూడా తమ ప్రాంతాల్లో పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు అంచనా.

వేర్‌హౌజ్‌లు, మదర్‌ హబ్స్‌, డెలివరీ హబ్స్‌, ప్యాకేజింగ్‌, వేర్‌హౌజ్‌ మేనేజ్‌మెంట్‌లలో ఈ కొలువులు ఉన్నాయి. మరోపక్క.. అమెజాన్ ఇండియా కూడా దసరా టార్గెట్లను ఛేదించడానికి  50వేల సీజనల్‌ ఉద్యోగాలను సృష్టించింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితర సంస్థలు పండగ సీజల్లో 3 కోట్లమంది నుంచి ఆర్డర్లు స్వీకరించి, రూ. 22 వేల కోట్ల వ్యాపారం చేయనున్నాయని వ్యాపార విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. దసరా, దీపావళి సీజన్లో తాత్కాలిక నిరుద్యోగులకు, కాలేజీ యువతకు ఇది మంచి అవకాశమని చెబుతున్నారు. సీజనల్ ఉద్యోగాలు చేసిన వారికి భవిష్యత్ రిక్రూట్మెంట్లలో ప్రాధాన్యం ఉంటుందని, ఇతర కంపెనీల్లోనూ ఉద్యోగాలు దక్కించుకోవచ్చని అంటున్నారు.