ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 7 ప్లస్ 54,999..! - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 7 ప్లస్ 54,999..!

May 15, 2017

ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ 10 సేల్’ రెండో రోజు భాగంగా తన ప్లాట్ ఫామ్ పై అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొబైల్, టాబ్లెట్స్ కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. దీనిలో భాగంగా ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(32జీబీ) స్మార్ట్ ఫోన్ ధరను 72,000 రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గించింది. ఒకవేళ 128జీబీ వెర్షన్ ఐఫోన్ 7 ప్లస్ ను కొనాలనుకుంటే, దాని ధరను కూడా 19 శాతం తగ్గించింది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ ధర 82,000రూపాయల నుంచి 65,999రూపాయలకు దిగొచ్చింది. మరో స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 7పై కూడా 27 శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.
మొబైల్ కేటగిరీలోనే గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్ ధర కూడా 13వేల రూపాయల తగ్గి, రూ.53,999కు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ కు చెందిన మరో మోడల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై 19-22 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇక టెలివిజన్ కేటగిరీలో ప్యానసోనిక్ 109సీఎం ఫుల్ హెచ్డీపై అతిపెద్ద డీల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దీని ధర 49,900 రూపాయల నుంచి 27,999 రూపాయలకు తగ్గించింది. అదేవిధంగా ఎల్జీ 108 సీఎం ఫుడ్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర కూడా 14,901 రూపాయలు తగ్గించింది. బడ్జెట్ రేంజ్ స్మార్ ఫోన్లపై కూడా 7,999 రూపాయల వరకు ఫ్లిప్ కార్ట్ తగ్గింపును ప్రకటించింది.

HACK:

  • Flipkart Announces iPhone 7Plus Sales Starting from  54,999/-