ఫ్లిప్‌కార్ట్ మరో ఆఫర్.. 5 రోజులు బిగ్ షాపింగ్ డే సేల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లిప్‌కార్ట్ మరో ఆఫర్.. 5 రోజులు బిగ్ షాపింగ్ డే సేల్

November 28, 2019

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 రోజులపాటు బిగ్ షాపింగ్ డే సేల్స్‌ను మరోసారి ప్రారంభించింది. డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచనున్నారు. దీంట్లో పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఇతర వస్తువులు తక్కువ ధరలకే అందించనున్నట్టు వెల్లడించింది. ఈ డిస్కౌంట్ సేల్స్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. 

Flipkart.

ఈ సేల్‌లో భాగంగా రియల్‌మి 5, రియల్‌మి ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఆపిల్ ఐఫోన్ 7 ఫోన్లపై భారీ తగ్గింపు ధరలకే అందించబోతున్నారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఇతర వస్తువులపై కూడా ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను ఇస్తున్నారు. వీటితో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ కూడా తీసుకువచ్చారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో వస్తువులు కొనుగోలు చేసేవారికి 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. డిసెంబర్ 5 వరకు ఇది అందుబాటులో ఉండనుంది. కాగా ఇటీవల ధర సందర్భంగా కూడా ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి ఆఫర్ తీసుకువచ్చింది.