Flipkart good news for iPhone lovers..huge discount
mictv telugu

ఐఫోన్‌ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్..

July 23, 2022

Flipkart good news for iPhone lovers..huge discount

దేశవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ ప్రియులకు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు గుడ్‌న్యూస్ చెప్పాయి. బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022-23 పేరుతో ఆఫర్‌ను తీసుకొస్తున్నామని, ఈ ఆఫర్ నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుందని, ఈసేల్‌లో ఐఫోన్‌ 11 రూ.39,999, ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఐఫోన్‌లు కొనాలని ఆశగా ఎదురుచూస్తున్న వినియోగదారులు.. సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్ కార్డ్‌లతో షాపింగ్ చేస్తే, అదనంగా.1,000 తగ్గింపుతో ఈ ఐఫోన్‌లు పొందవచ్చని, ఫలితంగా ఐఫోన్‌ 11 ధర 40 వేల దిగువకు చేరగా, ఐఫోన్‌ 12ను రూ. 51,999కే సొంతం చేసుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

”ఐఫోన్ 11 64జీబీ బ్లాక్ వేరియంట్‌ను రూ. 2,000 బ్యాంక్ తగ్గింపుతో రూ. 39,999 ధరకు పొందవచ్చు. మోటో జీ 60 కూడా తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంకు ఆఫర్‌తో కలిసి మోటో జీ60 ధర రూ. 13,999కి లభ్యం. పోకో ఎం4 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో షావోమి, వివో, రెడ్‌మినోట్‌ ఫోన్లు కూడా డిస్కౌంట్‌ ధరల్లో అందిస్తోంది” అని ప్లిఫ్‌కార్డ్ పేర్కొంది.

ఇక, అమెజాన్ ప్రైమ్ విషయానికొస్తే.. ప్రత్యేక సబ్ స్క్రిప్షన్ సేవలు అందించడానికి ముందుకొచ్చినట్లు తెలిపింది. వార్షికంగా రూ.1,499, నెలవారీగా అయితే రూ.179 చందా కట్టి అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించొచ్చు అని, అమెజాన్ పోర్టల్‌పై ప్రైమ్ సభ్యుల కోసం కేటాయించే ప్రత్యేక డీల్స్‌ను సొంతం చేసుకోని, ఉచిత షిప్పింగ్ సేవలు పొందొచ్చుని పేర్కొంది. అంతేకాదు, స్మార్ట్ ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు, గ్రోసరీ ఇలా ఎన్నో విభాగాల్లో అమెజాన్ తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. ”యాపిల్ ఐఫోన్ 13ను రూ.64,900కు ఆఫర్ చేస్తోంది. మామూలు రోజుల్లో దీని ధర రూ.66,900. దీనికి అదనంగా మరో రూ.12,950 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఐసీఐసీఐ, ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.3,000) సొంతం చేసుకోవచ్చు.”