ఆన్‌లైన్‌లో వేపపుల్ల అమ్మకం.. ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆన్‌లైన్‌లో వేపపుల్ల అమ్మకం.. ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్

August 23, 2019

Flipkart Sale Neem Datun Stick In Online

ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ వ్యాపారానికి గిరాకీ బాగా పెరిగింది. దీనికి తోడు నగరాల్లో ఉండే వారు సహజ సిద్ధ ఆహార పదార్థాలపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. పాత సంప్రదాయ పద్దతులను అలవాటు చేసుకుంటున్నారు. ఆరోగ్య వంతమైన జీవితం కోసం రాగి బిందెలో నీళ్లు తాగడం, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ఇలా అనేక రకాల పద్దతులు పాటిస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆలోచన చేసింది. ఏకంగా పళ్లు తోముకునేందుకు వేప పుల్లలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. నిత్యం మన చుట్టూ లభించే వేప పుల్లలను కూడా అమ్మకానికి పెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. కొంత మంది వీటిని ఆర్డర్ చేసుకొని వాడుతుండటం విశేషం. 

50 వేప పుల్లలను 70 శాతం ఆఫర్‌తో కేవలం రూ. 298కే అందిస్తున్నట్టు పేర్కొంది. చిగుళ్లలో ఇబ్బంది ఉన్నవారు.. ఆయుర్వేద పద్దతిలో పళ్లు తోముకోవాలని అనుకునే వారు దీన్ని వాడుకోవాలంటూ సూచిస్తున్నారు. 780 గ్రాముల ఈ పుల్లలు ఏడాది వరకు మన్నికగా ఉంటాయని చెబుతోంది. మహిళలు, పురుషులు ఎవరైనా వీటిని వాడుకునే అవకాశం ఉందంటోంది. కాగా గతంలో అమేజాన్ పిడకలను ఆన్‌లైన్‌లో అమ్మి అందరి ద‌ృష్టిని ఆకర్షించింది. మరి ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తెచ్చిన ఈ వేపపుల్ల వ్యాపారం భవిష్యత్‌లో ఎలా ఉంటుందో చూడాలి.