ఫ్లిప్‌కార్ట్ పుణ్యం.. 3 రోజుల్లో 70 మంది కోటీశ్వర్లు! - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లిప్‌కార్ట్ పుణ్యం.. 3 రోజుల్లో 70 మంది కోటీశ్వర్లు!

October 21, 2020

Flipkart Sales Turns 70 Sellers Crorepati

కరోనా వైరస్ విపత్కర సమయంలో ప్రముఖ దేశీయ ఈ కామర్స్ సంస్థ కేవలం మూడు రోజుల్లో 70 మంది అమ్మకందారులను కోటీశ్వర్లుగా మలిచింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఈనెల 16 నుంచి 21 వరకు బిగ్‌ బిలయన్‌ డే సేల్‌ నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ సేల్ బిగ్ సక్సెస్ అయిందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో పాల్గొన్న 70 మంది అమ్మకందారులు కేవలం మూడురోజుల్లో కోటీశ్వరులయ్యారు. అలాగే పదివేల మంది అమ్మకందారులు లక్షాధికారులు అయ్యారు. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ సంస్థ ప్రకటించింది. 

ఇక మొదటి మూడు రోజుల్లో 3 లక్షలకుపైగా అమ్మకందారులకు ఆర్డర్లు వచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ ఆర్డర్లలో 60 శాతం ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి వచ్చినట్టు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకందారుల సంఖ్య 20శాతం పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ దేశవ్యాప్తంగా 3,000కు పైగా పిన్‌కోడ్‌లకు సేవలు అందిస్తున్నది. ఈ సేల్‌‌లో ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్‌ పేలేటర్‌ ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ సేల్ సమయంలో డిజిటల్‌ లావాదేవీలు 60 శాతం పెరిగాయి. ఈ ఏడాది సేల్‌లో వినియోగదారులు అత్యవసరమైన ఉత్పత్తులను ఎక్కువ ఆర్డర్ చేసినట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.